narasimhan: రాజ్‌భవన్‌లో కలకలం.. గవర్నర్ నరసింహన్, తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం!
- ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు
- కొత్త సంవత్సరంలో ప్రభుత్వానికి సహకరించాలని చెప్పిన గవర్నర్
- రాష్ట్రానికి గవర్నర్‌గా వ్యవహరించాలని కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు
- రాజకీయ నాయకుడిలా వ్యవహరించకూడదని హితవు
హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో టీపీసీసీ నేతలు వాగ్వివాదానికి దిగినట్లు తెలిసింది. రాష్ట్ర సమస్యలు, టీఆర్ఎస్ పార్టీ తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడానికి ఈ రోజు టీపీసీసీ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, సర్వే సత్యనారాయణతో పాటు పలువురు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను జైలు నుంచి విడుదల చేయాలని గవర్నర్‌ను కాంగ్రెస్ నేతలు కోరారు.
అయితే, కొత్త సంవత్సరంలో ప్రభుత్వానికి సహకరించాలని కాంగ్రెస్ నేతలకు గవర్నర్ చెప్పినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ నేతలు గవర్నర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి గవర్నర్‌గా వ్యవహరించాలని, రాజకీయ నాయకుడిలా వ్యవహరించకూడదని నరసింహన్‌కు కాంగ్రెస్ నేతలు చెప్పినట్లు సమాచారం. ఈ విషయాలను కాంగ్రెస్ ప్రతినిధులు మీడియాకు చెప్పారు.