whatsapp: టీడీపీపై తీవ్ర విమర్శలు.. ఆపై భయంతో ఆత్మహత్యాయత్నం!

  • వాట్సాప్ గ్రూప్ లో తీవ్ర విమర్శలు
  • పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయం
  • విషగుళికలు మింగి ఆత్మహత్యాయత్నం

అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి బుధవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే, ఇతను టీడీపీకి చెందిన వాట్సాప్ గ్రూప్ లో టీడీపీని, ఆ పార్టీ నేతలను అసభ్య పదజాలంతో విమర్శిస్తూ, కామెంట్లు పోస్ట్ చేశాడు.

ఆ తర్వాత టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ ఎవరి ద్వారానో తెలుసుకున్నాడు. దీంతో, తనను అరెస్ట్ చేస్తారని భయపడిపోయిన సదరు వ్యక్తి... స్థానిక పాఠశాల ఆవరణలో విషగుళికలు మింగాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతన్ని గ్రామస్తులు గుర్తించి, బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని కుటుంబసభ్యులు తెలిపారు.

whatsapp
suicice attempt
Telugudesam
  • Loading...

More Telugu News