sundeep kishan: 'మనసుకు నచ్చింది' .. రిలీజ్ కి ముహూర్తం కుదిరింది

  • మహేశ్ సోదరి మంజుల దర్శకత్వంలో 'మనసుకు నచ్చింది'
  • ఈ నెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు 
  • కథానాయికగా అమైరా దస్తూర్

తెలుగు .. తమిళ భాషల్లో వైవిధ్యభరితమైన కథలను .. పాత్రలను ఎంపిక చేసుకుంటూ, సందీప్ కిషన్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన మహేశ్ సోదరి మంజుల దర్శకత్వంలో 'మనసుకు నచ్చింది' సినిమా చేశాడు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశకు చేరుకున్నాయి. ఈ నెల 26వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

అమైరా దస్తూర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, త్రిదా చౌదరి కీలకమైన పాత్రను పోషించింది. యూత్ కి కనెక్ట్ అయ్యే ప్రేమకథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో మంజుల కూతురు కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనుండటం విశేషం. మాస్ ఆడియన్స్ మనసు దోచుకున్న సందీప్ కిషన్, ఈ సినిమాతో యూత్ నుంచి ఎన్ని మార్కులు దక్కించుకుంటాడో. దర్శకురాలిగా మంజులకు ఈ సినిమా సక్సెస్ ను ఇస్తుందేమో చూడాలి.    

  • Error fetching data: Network response was not ok

More Telugu News