Pawan Kalyan: పవన్ కల్యాణ్ పై మరోసారి విమర్శలు గుప్పించిన కత్తి మహేష్!

  • పవన్ వైరస్ లా తయారయ్యారు
  • సామాజిక చికిత్స అవసరం
  • చట్టపరమైన చర్యలు అవసరం లేదు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సినీ క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ ఒక వైరస్ లా తయారయ్యారని... సమాజాన్ని నాశనం చేస్తున్న హెచ్ఐవీ వైరస్ కంటే ప్రమాదకరంగా మారారని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తికి ఓ సామాజిక చికిత్స అవసరమని... చట్టపరమైన చర్యలు అవసరం లేదని అన్నారు.

తన ఫేస్ బుక్ స్నేహితులు ఎంతో మంది పవన్ కల్యాణ్ అభిమానులపై పోలీస్ ఫిర్యాదు చేయవచ్చు కదా? అని అడుగుతున్నారని మహేష్ చెప్పారు. చంపుతామంటూ తనకు వస్తున్న హెచ్చరికలు, అసభ్యకరమైన కామెంట్ల నేపథ్యంలో తన స్నేహితులు ఈ సూచన చేస్తున్నారని తెలిపారు. అసలు విషయమేంటంటే, తనను విమర్శిస్తున్నవారిలో ఎక్కువ మంది టీనేజర్లే అని... అభిమానమనే పిచ్చితో వారు చేస్తున్న పనికి తన గుండె బాధపడుతోందని అన్నారు.

Pawan Kalyan
Kathi Mahesh
  • Error fetching data: Network response was not ok

More Telugu News