allu aravind: అల్లు అరవింద్ ఆపకపోతే.. ఇక నేను యాక్షన్ లోకి దిగుతా!: కత్తి మహేష్ వార్నింగ్

  • పందులతో పోలుస్తూ నీచ వ్యాఖ్యలు చేస్తున్నారు
  • ఇదంతా గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచే జరుగుతోంది
  • అల్లు అరవింద్ వీటిని ఆపాలి

సోషల్ మీడియాలో తనపై వస్తున్న దారుణ వ్యాఖ్యల గురించి సినీ క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి ఫైర్ అయ్యారు. ఇవన్నీ కూడా అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచే వస్తున్నాయని ఆయన మండిపడ్డారు. తన ఫొటోలను వాడుతూ, పందులతో పోలుస్తూ నీచమైన కామెంట్లు చేస్తున్నారని ఫేస్ బుక్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.

వీటిపై అల్లు అరవింద్ చర్యలు తీసుకోకపోతే... తాను యాక్షన్ లోకి దిగాల్సి ఉంటుందని హెచ్చరించారు. తన ఫొన్ నంబర్ కూడా మెగా ఫ్యాన్స్ కు చేరిపోయిందని.... అది కూడా గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచే జరిగిందని ఆయన ఆరోపించారు. ఇలాంటివాటిని ఆపాలని అన్నారు.  

allu aravind
Kathi Mahesh
  • Loading...

More Telugu News