Lalu Prasad Yadav: జైల్లో చలిగా ఉందన్న లాలూ... తబలా వాయించమని కౌంటర్ వేసిన న్యాయమూర్తి!

  • పశుదాణా కేసులో దోషిగా లాలూ
  • శిక్ష కోసం వేచి చూస్తున్న ఆర్జేడీ అధినేత
  • కోర్టులో న్యాయమూర్తితో ఆసక్తికర సంభాషణ
  • నేడు శిక్ష ఖరారయ్యే అవకాశం

పశు దాణా కుంభకోణం కేసులో దోషిగా నిరూపింపబడి, ప్రస్తుతం జైల్లో ఉండి తనకు పడే శిక్ష కోసం వేచి చూస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, నిన్న కోర్టుకు వచ్చిన సందర్భంగా ఆయనకు, న్యాయమూర్తి శివ్ పాల్ సింగ్ కు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. "జైలులో చలిగా ఉంది" అని లాలూ ప్రసాద్ వ్యాఖ్యానించగా, ఆ మాటలు విన్న శివ్ పాల్ సింగ్ వెంటనే కౌంటర్ వేశారు.

 "అలా అయితే తబలా వాయించు" అని ఆయన అనడంతో అక్కడ నవ్వులు విరిశాయి. తాను న్యాయవిద్యను కూడా అభ్యసించానని లాలూ ఈ సందర్భంగా వెల్లడించారు. వాస్తవానికి లాలూ సహా ఇతర దోషులకు 3వ తేదీన శిక్షలను ఖరారు చేయాల్సి వుండగా, అది వాయిదా పడుతూ వచ్చింది. నేడు లాలూ పరిస్థితులను బట్టి వ్యక్తిగతంగా లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరవుతారని సమాచారం.

Lalu Prasad Yadav
CBI Special Court
Jail
  • Loading...

More Telugu News