Cinema: సినిమా టికెట్ ధరలకు రెక్కలు... పెంచుకునేందుకు హైకోర్టు అనుమతి!

  • ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునేంత వరకూ పెంచిన ధరలే
  • మొత్తం వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాలకు ఆదేశం
  • పెంచిన ధరల మేరకు పన్నులను చెల్లించాలన్న హైకోర్టు

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరలకు రెక్కలు రానున్నాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు ధరల పెంపుపై నిర్ణయం తీసుకునేంత వరకూ పెంచిన ధరలను వసూలు చేసుకోవచ్చని హైకోర్టు ఆదేశించింది. అయితే, ఏ మేరకు ధరలను పెంచామన్న విషయాన్ని అధికారులకు తెలపాలని, ఆ ధరల నిష్పత్తిలోనే పన్నులను చెల్లించాలని పేర్కొంది.

 టికెట్ ధరల పెంపుపై విచారణ జరిపిన జస్టిస్ ఎస్వీ భట్, ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, మొత్తం వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలనూ ఆదేశించారు. కాగా, సినిమా టికెట్ ధరలను పెంచుకునే విషయంలో ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయని, నిర్ణయం వెలువడేంత వరకూ అధిక ధరలను వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని పలు థియేటర్ల యజమానులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా, కోర్టు వాటిని విచారించి ఈ ఆదేశాలు జారీ చేసింది.

Cinema
Ticket Price
Telangana
Andhra Pradesh
  • Loading...

More Telugu News