New Year: న్యూ ఇయర్ వేడుకల కోసం గోవా వెళ్లి, కటకటాలపాలైన టీఆర్ఎస్ చోటా నేతలు

  • టూర్‌లో భాగంగా 1న గోవా చేరుకున్న సంగారెడ్డి జిల్లా నేతలు
  • స్థానికులతో గొడవ.. పోలీసులకు ఫిర్యాదు
  • అరెస్ట్ చేసిన పోలీసులు

నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు గోవా వెళ్లిన కొందరు టీఆర్ఎస్ నేతలు అక్కడ జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను ఘనంగా జరుపుకునేందుకు సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేట మాజీ సర్పంచ్ దేవానందం సహా 16 మంది టీఆర్ఎస్ నేతలు గత నెల 29న టూర్‌కు వెళ్లారు. అందులో భాగంగా షిర్డీ ఇతర ప్రాంతాలను సందర్శించిన వారు 1న గోవా చేరుకున్నారు.  

గోవాలోని కలంగుట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తివైవాడో గెస్ట్‌హౌస్‌లో బస చేసిన వారికి ఏదో విషయంలో స్థానికులతో వివాదం చోటుచేసుకుంది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయింది. ప్రస్తుతం వారు అక్కడి జైల్లో ఉన్నారు. విషయం తెలియడంతో వారిని విడిపించేందుకు దేవానందం సోదరుడు శ్రీకాంత్ న్యాయవాదితో కలిసి గోవా వెళ్లారు.

New Year
Telangana
TRS
Goa
Leaders
  • Error fetching data: Network response was not ok

More Telugu News