punjagutta: శ్మశానమే వేదిక .. సమాధులే టేబుళ్లుగా చేసుకుని మందు కొట్టిన యువకులు!

  • పంజాగుట్ట హిందూ శ్మశాన వాటికలో మందు కొట్టిన యువకులు
  • అదే సమయంలో అక్కడికి వెళ్లిన మేయర్ బొంతు రామ్మోహన్
  • పోలీస్ స్టేషన్ కు తరలించాలని ఆదేశాలు 

శ్మశానమే వేదికగా, అక్కడున్న సమాధులే టేబుళ్లుగా చేసుకుని మందు కొడుతున్న యువకులను చూసి ఆశ్చర్యపోవడం హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ వంతైంది. పంజాగుట్ట హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి పనులు పరిశీలించే నిమిత్తం మేయర్ బొంతు రామ్మోహన్ ఈరోజు సాయంత్రం అక్కడికి వెళ్లారు. అదే సమయంలో కొంతమంది యువకులు అక్కడ మందు కొడుతున్న దృశ్యం ఆయన కంటపడింది.

దీంతో, ఆగ్రహించిన ఆయన, ఆ యువకులను అదుపులోకి తీసుకోవాలని, పోలీస్ స్టేషన్ కు తరలించాలని ఆదేశించారు. ఈ సంఘటనలో మరో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. మందు కొడుతున్న యువకుల్లో ఒకరు ఆ వార్డు సభ్యురాలు జయలక్ష్మి కుమారుడు కూడా ఉన్నారు. కాగా,  నిబంధనల ప్రకారం, ఇరవై ఒక్క సంవత్సరాల లోపు యువకులను ‘వైన్స్’ లోకి అనుమతించరు. ఆలోపు వయసున్న యువకులు ఇలా శ్మశానల్లో చేరి ఇలాంటి పనులకు పాల్పడుతున్నట్లు సమాచారం. 

punjagutta
Hyderabad
  • Loading...

More Telugu News