North Korea: 'అలా ఉండాలి'... ఉ.కొరియాపై కేరళ ముఖ్యమంత్రి ప్రశంసల జల్లు

  • ఉత్త‌ర‌ కొరియా అమెరికా ఒత్తిళ్లకు ఏమాత్రం తలొగ్గడం లేదు
  • విజయవంతంగా అమెరికా వ్యతిరేక అజెండా అనుసరిస్తోంది
  • సామ్రాజ్యవాద శక్తులతో పోరాడే విధానంలో ఆ దేశమే ఉదాహరణ

ఉత్త‌ర‌కొరియా వ‌రుస‌గా క్షిప‌ణి ప‌రీక్ష‌లు చేస్తూ యుద్ధ భ‌యాన్ని రేకెత్తిస్తోన్న విష‌యం తెలిసిందే. తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆ దేశాన్ని ప్రశంసిస్తూ వ్యాఖ్య‌లు చేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించాయి. ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ... అమెరికా ఒత్తిళ్లకు ఉత్త‌ర‌ కొరియా ఏమాత్రం తలొగ్గడం లేదని అన్నారు. విజయవంతంగా అమెరికా వ్యతిరేక అజెండా అనుసరిస్తోందని, సామ్రాజ్యవాద శక్తులతో ఎలా పోరాడాలో తెలపడానికి ఆ దేశమే ఉదాహరణ అని అన్నారు. గ‌తంలో కేరళ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్‌ కూడా ఇటువంటి వ్యాఖ్య‌లే చేశారు.

  • Loading...

More Telugu News