pavan: 'అజ్ఞాతవాసి'లో పవన్ చేసింది డ్యూయెల్ రోల్?

  • టీజర్ కి .. సాంగ్స్ కి సూపర్బ్ రెస్పాన్స్
  • పవన్ జోడీగా కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్
  • అభిమానుల్లో పెరిగిపోతోన్న ఆసక్తి        

'అజ్ఞాతవాసి' సినిమా నుంచి వచ్చిన టీజర్ .. సాంగ్స్  పవన్ అభిమానులను హుషారెత్తిస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించి బయటికి వస్తోన్న ఒక్కో విషయం వాళ్లలో కుతూహలాన్ని పెంచేస్తోంది. అలా వాళ్లలో మరింత ఆసక్తిని రేకెత్తించే ఒక వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. ఈ సినిమాలో పవన్ ద్విపాత్రాభినయం చేశాడనేది ఆ వార్త సారాంశం. కావాలనే ఈ విషయాన్ని  గోప్యంగా వుంచారట.

ఈ రెండు పాత్రలు ఒకే జనరేషన్ కి సంబంధించినవి కావడం విశేషమని అంటున్నారు. ఒక పాత్ర జోడీగా కీర్తి సురేశ్ .. మరో పాత్ర సరసన అనూ ఇమ్మాన్యుయేల్ కనిపిస్తారని చెబుతున్నారు. ఒకే జనరేషన్ కి సంబంధించి పవన్ రెండు పాత్రలను పోషించడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ రెండు పాత్రలు ఒకేసారి స్క్రీన్ పై కనిపిస్తాయని కూడా చెప్పుకుంటున్నారు. జోరుగా జరుగుతోన్న ఈ ప్రచారంలో వాస్తవమెంతన్నది చూడాలి మరి.       

pavan
keerthi suresh
anu
  • Loading...

More Telugu News