deepika padukone: పెళ్లి పీటలు ఎక్కనున్న దీపికా పదుకునే, రణవీర్ సింగ్.. రేపే ఎంగేజ్ మెంట్?

  • ఐదేళ్లుగా డేటింగ్
  • మాల్దీవుల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
  • శ్రీలంకలో రేపు ఎంగేజ్ మెంట్

బాలీవుడ్ లో మరో భారీ వివాహ వేడుక జరగబోతోందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీపికా పదుకునే, రణవీర్ సింగ్ లు వివాహబంధంతో ఒక్కటవబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రేపు (జనవరి 5) దీపిక పుట్టిన రోజు. రేపటితో ఆమె 32వ ఏట అడుగుపెడుతోంది.

 పుట్టినరోజు వేడుకను సెలబ్రేట్ చేసుకోవడానికి వీరిద్దరూ ఇప్పటికే సీక్రెట్ గా శ్రీలంకకు చేరుకున్నారు. ఈ వేడుకలోనే వీరిద్దరూ ఉంగరాలను మార్చుకోబోతున్నారని జాతీయ మీడియా చెబుతోంది. నిశ్చితార్థం తర్వాత మరి కొన్ని రోజుల్లోనే వివాహ వేడుక ఉంటుందని అంటోంది. గత ఐదేళ్లుగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. మరోవైపు, కొత్త సంవత్సరం వేడుకలను దీపిక, రణవీర్ లు మాల్దీవుల్లోని ఓ లగ్జరీ రిసార్ట్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. అక్కడి నుంచి వారి కుటుంబసభ్యులతో కలసి శ్రీలంక చేరుకున్నారు.

deepika padukone
ranveer singh
deepika ranveen engagement
deepika ranveer marriage
  • Loading...

More Telugu News