Shahrukh Khan: ఇతరుల ట్వీట్‌ను కాపీ కొట్టిన షారుక్ ఖాన్.. అసహనం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-cd561f592deca2712f95decf9b8293447a614a07.jpg)
- ఒరిజినల్ రాసిన వారికి క్రెడిట్ ఇవ్వాలని డిమాండ్
- 'జీరో' సినిమా ప్రమోషన్ కోసం ట్వీట్ కాపీ
- ఒరిజినల్ ట్వీట్ చేసింది ఓ రచయిత
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ తన తదుపరి చిత్రం 'జీరో' టీజర్‌ను ఆవిష్కరిస్తూ ఓ కవితాత్మక ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ట్వీట్ ఆయన స్వయంగా రాసింది కాదు... ఓ రచయిత పాత ట్వీట్‌కి కాపీ! ఈ విషయాన్ని గ్రహించిన నెటిజన్లు షారుక్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కవిత్వాన్ని వాడుకునే ముందు దాన్ని మొదట రాసిన వారికి క్రెడిట్ ఇవ్వాలని కూడా తెలియదా? అంటూ మండిపడుతున్నారు. అంతేకాకుండా రచయిత వాక్యాలను వాడుకున్నందుకు అతని పేరును ప్రస్తావించాలని డిమాండ్ చేస్తున్నారు.
షారుక్ ట్వీట్ చేసిన కవితను మిథిలేష్ బరియా అనే రచయిత 2015లోనే ట్వీట్ చేశాడు. అంతేకాకుండా ఆ వాక్యాలను తన పుస్తకం 'చోటీ చోటీ బాతేన్'లో కూడా మిథిలేష్ ప్రచురించాడు. గతంలో కూడా మిథిలేష్‌కి ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని, పెద్ద పెద్ద రచయితలు మిథిలేష్ పుస్తకాల్లో నుంచి కాపీ కొట్టి డబ్బులు దండుకుంటున్నారని, కనీసం షారుక్ చొరవ తీసుకుని అతనికి గుర్తింపు కల్పించాలని నెటిజన్లు కోరుతున్నారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-2edcf11c21c43056e844077f8610ad88dd39c8ee.jpg)