raghu: ఎన్టీఆర్ తో తప్పకుండా ఒక సినిమా నిర్మిస్తాను: కమెడియన్ రఘు

  • మళ్లీ కొత్త బిజినెస్ మొదలెడుతున్నా  
  • నా అనుభవమే పెట్టుబడి 
  • సక్సెస్ అవుతుందనే నమ్మకం వుంది      

ప్రస్తుతం తానున్న పొజీషన్ కి చేరుకోవడానికి కమెడియన్ రఘు ఎన్నో కష్టాలుపడ్డారు. అయినవారి చేతిలోనే మోసపోయి, నష్టాల పాలయ్యారు. అయినా పట్టుదలతో పరుగును కొనసాగిస్తున్నారు. అలాంటి రఘు మళ్లీ ఒక బిజినెస్ ను మొదలుపెట్టనున్నట్టు ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో చెప్పారు.

" జీవితంలో ఏదో ఒకటి ట్రై చేయకపోతే ముందుకు వెళ్లలేం కదా .. అందుకే మరో బిజినెస్ ను మొదలుపెడదామని అనుకుంటున్నా. ఈ బిజినెస్ లో నా పెట్టుబడి నాకున్న అనుభవం మాత్రమే. నాకెంతో ఇష్టమైన ఎన్టీఆర్ తో ఒక సినిమాను నిర్మించాలని వుంది. తప్పకుండా ఆయనతో ఒక సినిమాను నిర్మిస్తాను. ఆ స్థాయికి వెళ్లాలంటే ధైర్యంగా కొన్ని అడుగులు వేయాల్సిందే. ముళ్లున్నా దాటుకుంటూ ముందుకు వెళ్లవలసిందే. నా సన్నిహితులతో కలిసి నేను చేయబోయే ఈ బిజినెస్ సక్సెస్ అవుతుందనే భావిస్తున్నా" అంటూ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News