Jagan: పులివెందుల పులి చంద్రబాబే!: దేవినేని ఉమ

  • పులివెందులకు చంద్రబాబు నీళ్లిచ్చారు
  • సొంత నియోజకవర్గాన్ని జగన్ నిర్లక్ష్యం చేశారు
  • ఇరిగేషన్ పై ఆయనకు అవగాహన లేదు

వైసీపీ అధినేత జగన్ పై ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. జగన్ బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో పులివెందులకు నీటిని తీసుకురాలేక పోయారని... పులివెందులకు నీటిని తీసుకొచ్చి ఇక్కడి ప్రజల్లో చంద్రబాబు ఆనందం నింపారని చెప్పారు.

ఇచ్చిన మాట ప్రకారం పులివెందులకు చంద్రబాబు నీటిని తీసుకొచ్చారని అన్నారు. కుప్పం కంటే ముందే పులివెందులకు నీటిని ఇచ్చామని చెప్పారు. సీఎం కావాలన్న ఏకైక లక్ష్యంతో సొంత నియోజకవర్గమైన పులివెందులను జగన్ నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. జగన్ కు ఇరిగేషన్ పై ఏ మాత్రం అవగాహన లేదని... పట్టిసీమ ఎక్కడుందో కూడా ఆయనకు తెలియదని ఎద్దేవా చేశారు. రాయలసీమలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లకు దశలవారీగా నీటిని అందిస్తామని చెప్పారు. 

Jagan
devineni uma
Chandrababu
pulivendula
  • Loading...

More Telugu News