Kathi Mahesh: కత్తి మహేష్, కోన వెంకట్ ల మధ్య మాటల యుద్ధం!

  • జోకర్లు రెచ్చిపోతున్నారన్న కోన
  • పవన్ ను ఏబ్రాసీని చేయవద్దన్న కత్తి
  • ఇప్పటికే చాలా అయ్యాడంటూ తీవ్ర వ్యాఖ్య

పవన్ కల్యాణ్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, సినీ క్రిటిక్ కత్తి మహేష్ లు సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిపై పవన్ అభిమానులు అదే స్థాయిలో ప్రతిస్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో, సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. తాజాగా కత్తి మహేష్ పై సినీ రచయిత కోన వెంకట్ పరోక్షంగా ట్వీట్ చేశారు. 'పవన్ మౌనాన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది జోకర్లు రెచ్చిపోతున్నారు' అంటూ కామెంట్ చేశారు.

కోన ట్వీట్ కు కత్తి మహేష్ అదే స్థాయిలో రిప్లై ఇచ్చారు. 'ఒక జోకర్ ను మరో జోకర్... ఒక బ్రోకర్ ను మరో బ్రోకర్ సమర్థించుకోవడం సహజమే. చేతకానితనాన్ని మౌనంతో అధిగమించడంలో కొంచమైనా వివేకం ఉంది. మీలాంటి వాళ్లు అనవసరంగా మొరుగుతూ పవన్ కల్యాణ్ ను మరీ ఏబ్రాసిని చేసేయకండి. ఇప్పటికే ఆయన చాలా వరకు అయిపోయాడు' అంటూ ఘాటుగా స్పందించారు. కత్తి కామెంట్ పై పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Kathi Mahesh
kona venkat
  • Loading...

More Telugu News