pavan: పవన్ పాత్ర పేరు ఇదే .. డైలాగ్స్ బుల్లెట్స్ లా పేల్తాయట!

  • ఇంట్రెస్టింగ్ గా పవన్ పాత్ర పేరు 
  • సాంగ్స్ లోను ఆ పేరు ప్రస్తావన 
  • యాక్షన్ కి .. ఎమోషన్ కి ప్రాధాన్యత   

త్రివిక్రమ్ .. పవన్ కల్యాణ్  కాంబినేషన్ అనగానే, ఆ సినిమాలో ప్రతిదీ ఒక ప్రత్యేకతను సంతరించుకుని ఉంటుందని అభిమానులు భావిస్తుంటారు. కథాకథనాలతో పాటు పవన్ పాత్ర పేరును కూడా త్రివిక్రమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా పెడుతుంటారని అంటుంటారు. 'జల్సా'లో సంజయ్ సాహూ ..' అత్తారింటికి దారేది'లో గౌతమ్ నందా అంటూ పవన్ పాత్రలకి పెట్టిన పేర్లు ఎంతో పాప్యులర్  అయ్యాయి.

అలాగే ఈ సినిమాలో ఆయన పవన్ పాత్రకి 'అభిజిత్ భార్గవ' అనే పేరు పెట్టినట్టుగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. 'ఏబీ .. ఎవరో నీ బేబీ' అనే సాంగ్ ను పరిశీలిస్తే, ఏబీ .. అంటే 'అభిజిత్ భార్గవ' అనే విషయం స్పష్టమవుతోంది. ఈ సినిమాలో పవన్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. యాక్షన్ .. ఎమోషన్ తో పాటు ఆయన డైలాగ్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. బుల్లెట్స్ లా పేలే ఆ డైలాగ్స్ .. ఫ్యాన్స్ ను హుషారెత్తిస్తాయని చెప్పుకుంటున్నారు.   

pavan
keerti suresh
anu
  • Loading...

More Telugu News