gazal: ‘గజల్ శ్రీనివాస్’ ఘోరాన్ని బయటపెట్టిన బాధితురాలికి ధైర్యం చెప్పిన నన్నపనేని రాజకుమారి!

  • అద్భుతమైన గజల్స్ పాడే శ్రీనివాస్ ఇంత దారుణానికి ఒడిగట్టాడు
  • బాధితురాలు అధైర్యపడొద్దు
  • మహిళా కమిషన్లు, పోలీసులు, న్యూస్ ఛానెల్స్ అండగా ఉంటాయి : నన్నపనేని రాజకుమారి

ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ బాధితురాలికి ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ ధైర్యం చెప్పారు. ఓ న్యూస్ ఛానెల్ లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న బాధితురాలకి ధైర్యం చెబుతూ ఫోన్ లో మాట్లాడారు. ‘గజల్’ ఘోరాన్ని బయటపెట్టిన బాధితురాలు భయపడాల్సిన పనిలేదని, పోలీసులు, న్యూస్ ఛానెల్స్, మహిళా కమిషన్లు అండగా ఉంటాయని ధైర్యం చెప్పారు. ‘గజల్’ సంఘటనలో సాక్ష్యాధారాలు లేకపోతే నమ్మేవాళ్లం కాదని, సాక్ష్యాధారాలు ఉన్నాయి కనుక నమ్ముతున్నామని అన్నారు. ‘అమ్మ’, ‘మహిళ’ల మీద అద్భుతమైన గజల్స్ పాడే శ్రీనివాస్, ఇంతదారుణానికి ఒడిగట్టాడా? అని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  

gazal
nannapaneni
  • Loading...

More Telugu News