Pawan Kalyan: ‘జనసేన’ పవన్ కల్యాణ్ ఎవరో నాకు తెలియదు!: ముద్రగడ పద్మనాభం

  • వెంకటగిరి సంస్థానాధీశులను కలిసిన ముద్రగడ
  • పవన్ తో నాకు పరిచయం లేదు
  • ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసిన కాపు ఉద్యమ నేత

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని, ఆయనతో తనకు పరిచయం లేదని వ్యాఖ్యానించారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో ఈరోజు ఆయన పర్యటించారు. వెంకటగిరి సంస్థానాధీశులను మర్యాదపూర్వకంగా ఆయన కలుసుకున్నారు. ఈ సందర్భంగా పలకరించిన మీడియా, పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావించగా పైవిధంగా ఆయన వ్యాఖ్యానించారు.

Pawan Kalyan
mudragada
  • Loading...

More Telugu News