rajnikant: డీఎంకే అధినేత కరుణానిధిని కలిసిన రజనీకాంత్!

  • చెన్నై గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి వచ్చిన రజనీ
  • మర్యాదపూర్వకంగా కలిశా
  • ఆయన నాకు చిరకాల మిత్రుడు-రజనీకాంత్

రాజకీయాల్లోకి వస్తున్నానని ఇటీవలే ప్రకటన చేసిన సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీని స్థాపించడానికి అడుగులు వేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే తన పార్టీలో చేరండంటూ రజనీ ఓ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. కాగా, కొద్ది సేపటి క్రితం డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని రజనీ కలిసి కాసేపు ముచ్చటించారు.

చెన్నై, గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి వచ్చిన రజనీకాంత్‌ను చూడడానికి అభిమానులు ఉత్సాహం చూపారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ... కరుణానిధిని మర్యాదపూర్వకంగా కలిశానని, తనకు ఆయన చిరకాల మిత్రుడని అన్నారు.

  • Loading...

More Telugu News