rajanikanth: రజనీకాంత్ పార్టీలోకి నటుడు లారెన్స్?

  • రేపు అధికారికంగా ప్రకటించనున్న లారెన్స్?
  • రజనీని కలిసి ఆయా విషయాలపై చర్చించనున్న లారెన్స్
  • రజనీకాంత్ కు వీరాభిమాని లారెన్స్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు లారెన్స్ రాఘవేంద్ర వీరాభిమాని అనే విషయం తెలిసిందే. రజనీకాంత్ త్వరలో స్థాపించనున్న రాజకీయపార్టీలో లారెన్స్ చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై లారెన్స్ రేపు విలేకరుల సమావేశం నిర్వహించి అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. ఆ తర్వాత రజనీకాంత్ ను కలిసి ఆయా విషయాలపై లారెన్స్ చర్చించే అవకాశముందట. కాగా, రజనీ వెంట నడుస్తానని లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్ రాజ్ మహాలింగం తాజాగా ప్రకటించారు. తన క్రియేటివ్ హెడ్ ఉద్యోగానికి కూడా ఆయన రాజీనామా చేశారు.

rajanikanth
lawerence
  • Loading...

More Telugu News