Vijayawada: దుర్గ గుడిలో ఎలాంటి తాంత్రిక పూజలు జరగలేదు : ఈవో సూర్యకుమారి

  • అంతరాలయంలో రోజూ చేసే అలంకారమే చేేశారు
  • గుడిలో ఎలాంటి తాంత్రిక పూజలు జరగలేదు
  • దుర్గగుడిలో ఏం జరిగినా నైతిక బాధ్యత నాదే : సూర్య కుమారి

విజయవాడ దుర్గగుడిలో తాంత్రిక పూజలు నిర్వహించారనే ఘటన నేపథ్యంలో ఈవో సూర్యకుమారి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ,
డిసెంబరు 26న అర్ధరాత్రి ఆలయంలో శుద్ధి కార్యక్రమం జరిగింది తప్పా, పూజ జరగలేదు.
ఆలయంలోకి వచ్చిన వారిలో ప్రధాన అర్చకుడు బద్రినాథ్, ఇద్దరు సహాయకులు ఉన్నారని, పార్థసారధి ఒక్కడే బయటి వ్యక్తిని అన్నారు. పూజల కోసం పిలిచామని ప్రధాన అర్చకుడు ఎక్కడా చెప్పలేదని, అంతరాలయంలో రోజూ చేసే అలంకారమే చేేశారు తప్పా, గుడిలో ఎలాంటి తాంత్రిక పూజలు జరగలేదని అన్నారు. ఆరోజు ఏం జరిగిందనే విషయమై ఎన్సీఎఫ్, మా సిబ్బంది, శానిటేషన్ సిబ్బందిని విచారిస్తున్నట్టు చెప్పారు. ఆలయ ప్రతిష్ట దిగజార్చే చర్య ఎవరు చేసినా తప్పేనని అన్నారు. దుర్గగుడిలో ఏం జరిగినా నైతిక బాధ్యత తనదేనని, ఆధారాలు లేకుండా తాను మాట్లాడనని చెప్పిన సూర్యకుమారి, తమ ఆలయంలో పలు రకాల గ్రూపులు ఉన్నాయని, ఆలయంలో జరిగే పనులపై గుత్తేదార్ల నుంచి ఒత్తిళ్లు వచ్చాయని అన్నారు. తనను లక్ష్యంగా చేసుకుని కొందరు విమర్శలు ఎందుకు గుప్పిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని, ఈ సంఘటనకు సంబంధించిన విషయాలపై సంబంధిత మంత్రికి తెలియజేశానని ఆమె పేర్కొన్నారు.

Vijayawada
durga temple
  • Loading...

More Telugu News