mumbai: ముంబైలో ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేస్తే రూ. 500 ఫైన్!

  • బహిరంగ మూత్ర విసర్జనపై ఉక్కుపాదం
  • ఉమ్మి వేసినా, చెత్త పడేసినా సినిమానే!
  • రూ. 500 స్పాట్ ఫైన్

ఎక్కడ పడితే అక్కడ బహిరంగ మూత్ర విసర్జన చేస్తూ పరిసరాలను గబ్బు పట్టిస్తున్న వారిపై మహారాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. బహిరంగంగా మూత్ర విసర్జన చేసినా, ఉమ్మి వేసినా, చెత్త పడేసినా... వెంటనే రూ. 500 జరిమానా విధిస్తామని తెలిపింది.

గతంలో ఇది రూ.100గా ఉండేది. 2006లో నిర్ణయించిన పాత జరిమానాలను ప్రభుత్వం తాజాగా మార్చింది. ముంబైతో పాటు మరో మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో కొత్త జరిమానాలను విధించనున్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మరింత కఠినంగా అమలు చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News