bitcoin price: బిట్ కాయిన్ కు మళ్లీ రెక్కలు... ఈ రోజు 10 శాతం అప్
- పేపాల్ వ్యవస్థాపకుడు థిల్ పెట్టుబడులు
- బయటపెట్టిన వాల్ స్ట్రీట్ జర్నల్
- దీంతో బిట్ కాయిన్లకు మళ్లీ డిమాండ్
క్రిప్టోకరెన్సీ అలియాస్ డిజిటల్ కరెన్సీ బిట్ కాయిన్ ధర మరోసారి ఎగిసింది. ఈ నెల 1న ఒక్క బిట్ కాయిన్ ధర 13,354 డాలర్లు కాగా, ఈ రోజు 14,951 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. పేపాల్ వ్యవస్థాపకుడు పీటర్ థిల్ పెద్ద మొత్తంలో బిట్ కాయిన్ లో ఇన్వెస్ట్ చేసినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొనడమే తాజా ర్యాలీకి కారణం.
పీటర్ థిల్ 2 కోట్ల డాలర్ల మేర బిట్ కాయిన్లు కొన్నట్టు వాల్ స్ట్రీట్ కథనం. అంతేకాదు, వీరు కొనుగోలు చేసిన తర్వాత బిట్ కాయిన్ ధర ఐదు రెట్లు పెరిగినట్టు ఈ కథనం పేర్కొంది. గతేడాది బిట్ కాయిన్ ధర మొత్తం మీద 13 రెట్లు పెరిగిన విషయం తెలిసిందే. కాగా, బిట్ కాయిన్ గత డిసెంబర్ 17న నమోదు చేసిన 19,666 డాలర్ల గరిష్ట స్థాయిని మరోసారి చేరుతుందని రాయిటర్స్ అంచనా.