maruti suzuku ertiga: తుది దశలో మారుతి కొత్త ఎర్టిగా... త్వరలో మార్కెట్ ప్రవేశం!

  • త్వరలో జరిగే ఆటో ఎక్స్ పోలో ప్రదర్శన
  • ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి
  • కొత్త మోడల్ లో మరింత స్పేస్

మారుతి కొత్త ఎర్టిగా మోడల్ త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది పరీక్షల దశలో ఉన్నట్టు మార్కెట్ వర్గాల సమాచారం. ఈ ఏడాది చివర్లో ఇది విడుదల కానుంది. దీనికంటే ముందు త్వరలోనే ప్రారంభం కానున్న ఆటో ఎక్స్ పోలో కొత్త మోడల్ ను మారుతి సుజుకి ఆవిష్కరించే అవకాశాలున్నాయి. ఈ కొత్త మోడల్ ఎర్టిగా గతంలో మాదిరిగానే 7 సీట్లతో ఉంటుంది. కాకపోతే పాత మోడల్ తో పోలిస్తే లోపల మరింత స్పేస్ ఉండనుంది. అలాగే, ముందు రూపం కూడా మార్పు సంతరించుకోనుంది. ఎల్ ఈడీ డే టైమ్ లైట్లు, స్టయిలిష్ అలాయ్ వీల్స్ తోపాటు భద్రత, సౌకర్యం దృష్ట్యా డ్యాష్ బోర్డ్ డిజైన్ లోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి. 

maruti suzuku ertiga
  • Loading...

More Telugu News