bhajarang dal: కాలేజీ అమ్మాయిలపై భజరంగ్ దళ్ కార్యకర్తల దాడి

  • ముస్లిం యువకులతో ఉండగా దాడి
  • సోషల్ మీడియాలో వీడియో అప్ లోడ్
  • ఇద్దరు కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు

ఇద్దరు కాలేజీ అమ్మాయిలపై భజరంగ్ దళ్ కార్యకర్తలు చేసిన దాడి మంగళూరులో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే, మంగళూరుకు సమీపంలో ఉండే తాలిపాడి యూనివర్శిటీలో ఇధ్దరు అమ్మాయిలు చదువుకుంటున్నారు. వీరిద్దరూ మరో ఇద్దరు ముస్లిం యువకులతో కలసి ఉండగా... వారిపై భజరంగ్ దళ్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది వైరల్ గా మారింది. చివరకు పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో, ఇద్దరు భజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీస్ కమిషనర్ టీఆర్ సురేష్ తెలిపారు.

bhajarang dal
mangalore women students attacked
  • Loading...

More Telugu News