'ఐశ్వర్యా రాయ్ నా కన్నతల్లి' అంటూ వచ్చిన విశాఖ కుర్రాడు!
- సంచలన ఆరోపణలు చేసిన సంగీత్ కుమార్
- 1988లో జన్మించానని చెప్పుకున్న విశాఖ యువకుడు
- నిరూపించే ఆధారాలు మాత్రం లేవట!
చిన్నప్పుడు ఐశ్వర్య తల్లిదండ్రులు కృష్ణరాజ్ రాయ్, వ్రిందా రాయ్ లు తనను రెండేళ్లు పెంచారని, ఆపై అడివేలు రెడ్డి, తనను విశాఖకు తీసుకు వచ్చాడని అంటున్నాడు. తనకిప్పుడు తల్లితో ఉండాలని ఉందని, ఆమే తన తల్లి అని నిరూపించే ఆధారాలు ఏవీ తనవద్ద లేదని చెబుతున్నాడు. ఇక ఈ సంగీత్ కుమార్ వ్యాఖ్యలపై ఐష్ స్పందిస్తుందో లేక నవ్వుకుని ఊరుకుంటుందో!