Kathi Mahesh: మన కర్మ కొద్దీ త్రివిక్రమ్ అగ్ర దర్శకుడు అయ్యాడు.. అంతా కాపీనే!: కత్తి మహేష్ సంచలన కామెంట్

  • కాపీ చేయడం తప్ప మరేమీ తెలియదు
  • యండమూరి రచనల నుంచి అరువు తెచ్చుకుంటాడు
  • ఆ మాత్రం రాసే దర్శకులు లేకనే త్రివిక్రమ్ కు పేరు

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు సినిమాలను కాపీ చేయడం తప్ప మరేమీ తెలియదని సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ వ్యాఖ్యానించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెడుతూ, "త్రివిక్రమ్ అనే దర్శకుడు కాపీ చెయ్యకుండా రాసిన, తీసిన సినిమా ఒక్కటి కూడా లేదు. కొన్ని సీన్ లో, సీక్వెన్సులో, ఏకంగా కథనో... ఇలా ఎదో ఒకటి కాపీ చేస్తూనే ఉంటాడు. లేదా ఒక డైలాగ్ ఏదో ఆసక్తికరంగా ఉంటే, దాని చుట్టూ కొన్ని సీన్లు అల్లే ప్రయత్నం చేస్తుంటాడు" అని ఆరోపించాడు.

మరో ట్వీట్ లో "ముఖ్యంగా యండమూరి వీరేంద్రనాథ్ రచనలలో నుంచి కొన్ని వాక్యాల్ని, ఆలోచనల్ని అరువు తెచ్చుకుని తనదైన కొన్ని పదాలను అక్కడక్కడా కూర్చి, మాయ చేసి మెప్పిస్తుంటాడు. మన కర్మకొద్దీ ఆ మాత్రం రాసే రచయితలు ఎవరూ లేక అగ్రదర్శకుడిగా చలామణి అయిపోతున్నాడు" అని విమర్శలు గుప్పించాడు.

Kathi Mahesh
Trivikram Srinivas
Yandamuri
  • Error fetching data: Network response was not ok

More Telugu News