chacolate: మరో 40 ఏళ్లలో మాయం కానున్న చాక్లెట్లు?
- కాకావో మొక్కల నుంచి చాక్లెట్ల ముడిపదార్థం
- పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు
- కకావో మొక్కలపై తీవ్ర ప్రభావం
చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు అందరికీ ప్రీతిపాత్రమైనవి చాక్లెట్లు. అలాంటి చాకెట్లు ఓ 40 ఏళ్ల తర్వాత కనిపించకపోవచ్చని ఓ తాజా అధ్యయనం తెలిపింది. వివరాల్లోకి వెళ్తే, చాక్లెట్ల తయారీకి అవసరమైన ముడి పదార్థం కకావో అనే మొక్కల నుంచి లభిస్తుంది. వర్షపాతం, ఉష్ట్రోగ్రత, తడి స్థిరంగా ఉండే ప్రాంతాల్లోనే ఈ మొక్కలు పెరుగుతాయి. అయితే, నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా 2050 నాటికి కకావో మొక్కలు పెరగడానికి అవసరమైన పరిస్థితులు క్షీణిస్తాయని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
ఈ పరిస్థితిని అధిగమించేందుకు... వాతావరణ పరిస్థితిని అధిగమించేలా కకావో మొక్కల్లో జన్యుపరమైన మార్పులు తీసుకొచ్చే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. చాక్లెట్లకు అవసరమైన ముడిపదార్థం సగానికి పైగా పశ్చిమాఫ్రికాలోని ఘనా, ఐవరీకోస్ట్ దేశాల నుంచి వస్తోంది.