Donald Trump: పిచ్చోడా... నా దగ్గర నీకన్నా పెద్ద బటన్ ఉంది!: కిమ్ కు ట్రంప్ రిటార్టు

  • నా టేబుల్ పై కూడా అణు బాంబు బటన్ ఉంది
  • అది చాలా పెద్దది, శక్తిమంతమైనది
  • కిమ్ జాంగ్ వ్యాఖ్యపై ట్రంప్ ప్రతిస్పందన

తన టేబుల్ పై ఓ బటన్ ఉన్నదని, దాన్ని నొక్కితే, అణుబాంబు బయలుదేరుతుందని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. "నార్త్ కొరియా నేత కిమ్ జాంగ్, ఇప్పుడే తన టేబుల్ పై ఎల్లప్పుడూ అణు బాంబు బటన్ ఉంటుందని చెప్పారు. ఆయనకు ఎవరైనా హితవు చెప్పండి. నా దగ్గర కూడా ఓ న్యూక్లియర్ బటన్ ఉంటుంది. అది చాలా పెద్దది, మరింత శక్తిమంతమైనది. నా బటన్ కూడా పని చేస్తుంది" అని అన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ పెట్టారు. ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది.

Donald Trump
Kim Jong Un
US
North Korea
  • Error fetching data: Network response was not ok

More Telugu News