ben cutting: ఆ బాల్ దెబ్బా? మజాకా?: భయంతో నెక్ట్స్ బాల్ కు హేస్టింగ్స్ ఔట్!

  • హేస్టింగ్స్ తలను తాకిన బెన్ కటింగ్ బౌన్సర్
  • హెల్మెట్ ఉండటంతో బతికిపోయిన హేస్టింగ్స్
  • తరువాతి బంతికే పెవిలియన్ కు!

బెన్ కటింగ్... సమకాలీన క్రికెట్ లో తన పేస్ బౌలింగ్ తో బ్యాట్స్ మెన్ ను భయపెట్టగల బౌలర్. అతను వేసిన ఓ బంతి జాన్ హేస్టింగ్స్ ను ఎంతగా భయపెట్టిందంటే, ఆ తరువాతి బంతికే అతను అవుట్ అయ్యాడు. బిగ్ బాష్ లీగ్ లో భాగంగా 'మెల్ బోర్న్ స్టార్స్'కి కెప్టెన్ గా ఆడుతున్న హేస్టింగ్స్ బ్యాటింగ్ చేస్తుండగా, బెన్ వేసిన ఓ షార్ట్ బాల్ అతి వేగంతో దూసుకొచ్చి ఆయన తల కుడివైపు బలంగా తాకింది.

బాల్ ధాటికి హేస్టింగ్స్ హెల్మెట్ ఎగిరి పడింది. ఆ బాల్ కు హేస్టింగ్స్ కు ఎలాంటి గాయమూ కాలేదు. ఇక అదే హెల్మెట్ లేకుంటే తనకేం జరిగేదన్న భయం మదిలో ఉండిపోయిందేమో, తరువాతి బంతికే ఆయన పెవిలియన్ చేరాడు. కాగా, మూడు సంవత్సరాల క్రితం బ్యాట్స్ మెన్ ఫిల్ హ్యూస్, ఓ బౌన్సర్ తగిలి మైదానంలోనే కుప్పకూలి, ప్రాణాలు వదిలిన విషాద ఘటన తెలిసిందే.

  • Error fetching data: Network response was not ok

More Telugu News