Kathi Mahesh: రూటు మార్చిన కత్తి మహేశ్.. నేరుగా పవన్‌తోనే యుద్ధానికి సై..దమ్ముంటే చర్చకు రావాలని సవాల్!

  • పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడిన కత్తి మహేశ్
  • పెళ్లాన్ని కాపాడుకోలేనోడు రాష్ట్రాన్ని ఏం కాపాడుతాడంటూ ఎద్దేవా
  • పార్టీ ఆఫీసు పెట్టి, పూజలు చేస్తే నాయకుడైపోడని వ్యాఖ్య

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ క్రిటిక్ కత్తి మహేశ్ మరోమారు నిప్పులు చెరిగాడు. పార్టీ ఆఫీసును ప్రారంభించి, దానికి పూజలు చేసినంత మాత్రాన నాయకుడు అయిపోడని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆయనకు అసలు రాజకీయ పరిజ్ఞానం కానీ, పరిణతి కానీ ఏ కోశానా లేవని ధ్వజమెత్తాడు. ఇటీవల కాలంలో పవన్‌నే ఏకైక లక్ష్యంగా చేసుకున్న కత్తి మహేశ్, పవన్ అభిమానులతో ఓ చానల్ నిర్వహించిన డిబేట్‌లో ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటి వరకు పవన్‌పై విమర్శలు మాత్రమే చేస్తూ వచ్చిన కత్తి ఇప్పుడు నేరుగా పవన్‌తోనే యుద్ధానికి దిగాడు.

పవన్‌కు దమ్ముంటే తనతో చర్చకు రావాలని సవాలు విసిరాడు. ‘పెళ్లాన్ని కాపాడుకోలేనివాడు రాష్ట్రాన్ని ఏం కాపాడతాడు?’ అంటూ ఎద్దేవా చేశాడు. అసలు పవన్‌కు కామన్‌సెన్సే లేదని, ప్రజాస్వామ్యం గురించి అస్సలు తెలియదని అన్నాడు. రాజకీయ పార్టీ అంటే పార్టీ  ఆఫీసు ఏర్పాటు చేసి దానికి పూజలు చేయడం కాదన్నాడు. రాజకీయ పార్టీ అంటే దానికో నిర్మాణం, ఓ పద్ధతి ఉంటాయని పేర్కొన్నాడు. పవన్‌కు నిజంగా రాజకీయాలపై చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్ర రాజకీయాలపై చర్చించాలనుకుంటే, ఏ విషయం గురించి చర్చించాలో నిర్ణయించుకుని వస్తే పవన్‌తో తాను చర్చకు సిద్ధమని కత్తి మహేశ్ సవాలు విసిరాడు.

Kathi Mahesh
Pawan Kalyan
Tollywood
Jana Sena
  • Loading...

More Telugu News