Chandrababu: ఉగాది నుంచి ‘పెళ్లి కానుక’ పథకం : సీఎం చంద్రబాబు
- ‘పెళ్లి కానుక’ను డ్వాక్రా సంఘాల ద్వారానే అమలు చేస్తా
- రాబోయే రోజుల్లో లక్ష మంది పేదలకు వివాహాలు జరిపిస్తా
- ఐదో విడత ‘జన్మభూమి’ని ప్రారంభించిన చంద్రబాబు
ఏపీలో ఉగాది నుంచి ‘పెళ్లి కానుక’ పథకాన్ని ప్రారంభించనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయా జిల్లాల్లో పదిరోజుల పాటు జరగనున్న జన్మభూమి కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో ఐదో విడత ‘జన్మభూమి’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెళ్లి కానుక పథకాన్ని డ్వాక్రా సంఘాల ద్వారానే అమలు చేస్తామని, రాబోయే రోజుల్లో లక్ష మంది పేదలకు వివాహాలు జరిపిస్తామని, పట్టణాల్లో ‘అన్న’ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కాగా, పదిరోజుల పాటు సాగే ‘జన్మభూమి’ కార్యక్రమాల్లో ఆయా జిల్లాల్లో చంద్రబాబు పాల్గొంటారు. వాటి వివరాలు..
* 3వ తేదీన - కడప
* 4వ తేదీన - శ్రీకాకుళం
* 5వ తేదీన - విజయనగరం
* 6వ తేదీన - నెల్లూరు
* 7వ తేదీన - కర్నూలు
* 8వ తేదీన - పశ్చిమగోదావరి, విశాఖ
* 9వ తేదీన - చిత్తూరు
* 10వ తేదీన - తూర్పుగోదావరి
* 11వ తేదీన - అనంతపురం