padma rao: ఆబ్కారీ శాఖ ద్వారా ఆదాయం గణనీయంగా పెరుగుతోంది: ప‌ద్మారావు

  • అధికారులు, సిబ్బంది సంయుక్త కృషి ఫలిస్తోంది
  • భవిష్యత్తులో ఆబ్కారీ శాఖ కార్యకలాపాలు ముమ్మరం చేయాల్సి  ఉంది
  • కల్లు గీత కార్మికులకు ప్రయోజనం కలిగించే కార్యక్రమాలు చేపడుతున్నాం

ఆబ్కారీ శాఖ ద్వారా వస్తోన్న ఆదాయం గణనీయంగా పెరుగుతోందని, ప్రభుత్వ విధానాలతో పాటు అధికారులు, సిబ్బంది సంయుక్త కృషి ఫలిస్తోందని తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి పద్మారావు గౌడ్ అన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు ఈ రోజు మంత్రి పద్మారావును ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా  కలుసుకున్నారు. ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ భవిష్యత్తులో ఆబ్కారీ శాఖ కార్యకలాపాలు ముమ్మరం చేయాల్సి  ఉందని అన్నారు.  

కల్లు గీత కార్మికులకు ప్రయోజనం కలిగించే కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతోందని వాటిని సమర్థవంతంగా అమలు జరపాల్సి ఉందని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్ర ఆబ్కారీ కమిషనర్ ఆర్వీ చంద్రవదన్, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

padma rao
Telangana
government
  • Loading...

More Telugu News