KCR: ఒకరినొకరు తిట్టుకున్న కేసీఆర్, పవన్ కలిసిపోయారు!: కోదండరామ్ వ్యంగ్యం

  • శత్రువులు ఆప్తులయ్యారు.. ఆప్తులు శత్రువులయ్యారు
  • కాంట్రిబ్యూటరీ స్కీమ్ ను రద్దు చేయాలి
  • ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలులో ఏదో మతలబు ఉంది
  • మీడియాతో ప్రొఫెసర్ కోదండరామ్

తెలంగాణ సీఎం కేసీఆర్ తో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిన్న భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీపై ఇప్పటికే పలు విమర్శలు తలెత్తాయి. తాజాగా, తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ స్పందిస్తూ, ఒకరినొకరు తిట్టుకున్న కేసీఆర్, పవన్ కలిసిపోయారని, శత్రువులు ఆప్తులయ్యారని, ఆప్తులు శత్రువులయ్యారని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీని కోదండరామ్ ఈరోజు కలిశారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీచర్ పోస్టుల భర్తీలో టెట్ కు లేని నిబంధనలు టీఆర్టీకి ఎందుకు? అని ప్రశ్నించారు. కాంట్రిబ్యూటరీ స్కీమ్ ను రద్దు చేయాలని, ఏపీలో పనిచేస్తున్న నాల్గో తరగతి ఉద్యోగులను తెలంగాణకు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గించి, ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయడం సబబు కాదని, రూ.3.50కు యూనిట్ విద్యుత్ దొరుకుతుంటే, రూ.5.50కు కొనడంలోనే ఏదో మతలబు ఉందని ఆరోపించారు. నిరంతర విద్యుత్ సరఫరాతో భూగర్భజలాలు అడుగంటిపోతాయని కోదండరామ్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News