raj tarun: సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతోన్న రాజ్ తరుణ్

  • రాజ్ తరుణ్ హీరోగా 'రంగుల రాట్నం'
  • హీరోయిన్ గా చిత్రా శుక్లా పరిచయం 
  • త్వరలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్

రాజ్ తరుణ్ కథానాయకుడిగా గతంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై వచ్చిన 'ఉయ్యాలా జంపాలా' సినిమా హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు ఇదే బ్యానర్ పై రాజ్ తరుణ్ ఒక సినిమా చేశాడు. శ్రీరంజని దర్శకత్వం వహించిన ఈ సినిమాకి 'రంగుల రాట్నం' టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా ద్వారా 'చిత్రా శుక్లా' కథానాయికగా పరిచయం అవుతోంది.

 షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు ఈ రోజున అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. రాజ్ తరుణ్ ఆశించే హిట్ ఈ సినిమాతో లభిస్తుందో లేదో .. ఈ సినిమా చిత్రా శుక్లాకు ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News