amaravathi: అమరావతి నిర్మాణంకు సంబంధించిన ప్రశ్నకు పార్లమెంటులో అరుణ్ జైట్లీ సమాధానం

  • రూ. 3,324 కోట్ల రుణాన్ని ఏపీ కోరింది
  • ప్రపంచ బ్యాంకు పరిశీలనలో ఉంది
  • ఇప్పటికే రూ. 1500 కోట్లు ఇచ్చాం

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంకు సంబంధించిన ప్రశ్నకు  కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో సమాధానం ఇచ్చారు. అమరావతి నిర్మాణానికి రూ. 3,324 కోట్ల రుణం ఇచ్చే అంశాన్ని ప్రపంచ బ్యాంకు పరిశీలిస్తోందని చెప్పారు. అమరావతి నిర్మాణానికి నిధుల కేటాయింపుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. దీనిపై స్పందించిన అరుణ్ జైట్లీ... రాజధాని నిర్మాణానికి రూ. 3,324 కోట్లు కావాలని ఏపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకును కోరిందని చెప్పారు. ఈ అంశాన్ని వరల్డ్ బ్యాంక్ పరిశీలిస్తోందని... సంప్రదింపులు పూర్తి అయిన వెంటనే రుణం మంజూరవుతుందని తెలిపారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే రూ. 1500 కోట్లు ఇచ్చిందని చెప్పారు. 

amaravathi
ap govt
Arun Jaitly
YSRCP
vijayasai reddy
  • Loading...

More Telugu News