vishnukumar raju: గవర్నర్ నరసింహన్ తీరు మార్చుకోవాలి.. లేకపోతే కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం!: విష్ణు కుమార్ రాజు

  • తెలంగాణ బిల్లులకు వెంటనే మోక్షం
  • ఏపీ బిల్లులకు వెంటనే దక్కని ఆమోదం
  • వివక్ష చూపుతున్నారు

తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పై ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. నరసింహన్ హైదరాబాదులో ఉంటున్నందున తెలంగాణ పట్ల ప్రేమను చూపుతూ, ఏపీ పట్ల వివక్ష చూపుతున్నారని విమర్శించారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే చట్ట సవరణ బిల్లును (నాలా) నెలరోజులైనా గవర్నర్ ఆమోదించలేదని... తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇదే తరహా బిల్లును వారం రోజుల్లోనే ఆమోదించారని ఆయన మండిపడ్డారు.

ఏపీకి నాలా చట్టం చాలా అవసరమని... ఆ చట్టం లేకపోవడం వల్ల ఏపీకి పరిశ్రమలు రావడం లేదని విష్ణు అన్నారు. నాలా పన్ను 9 నుంచి 3 శాతానికి తగ్గాలని చెప్పారు. ఈ బిల్లుకు గవర్నర్ వెంటనే ఆమోదం తెలపాలని, లేని పక్షంలో గవర్నర్ పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

vishnukumar raju
narasimhan
  • Loading...

More Telugu News