ram gopal varma: పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి'తో స్ఫూర్తి పొందా.. అందుకే మళ్లీ వచ్చా: రామ్ గోపాల్ వర్మ

  • ట్విట్టర్ లోకి మళ్లీ రావడానికి 'అజ్ఞాతవాసి' కారణం
  • రజనీలో అంతటి పవర్ ను ముందెన్నడూ చూడలేదు
  • ప్రతి ఒక్కరి ఓటు రజనీకే

ట్విట్టర్ లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ. వచ్చీ రావడంతోనే తనదైన శైలిలో ట్వీట్ చేయడం ప్రారంభించారు. ట్విట్టర్ అజ్ఞాతవాసంలోకి వెళ్లిన తాను... పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి'తో స్పూర్తిని పొంది మళ్లీ వచ్చానని ట్వీట్ చేశారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై కూడా వర్మ కామెంట్ చేశారు. రాజకీయ ప్రవేశాన్ని ప్రకటిస్తున్న వేళ రజనీలో కనిపించిన పవర్ ను తాను ఇంతకు ముందెన్నడూ చూడలేదని అన్నారు. తమిళనాడులో ప్రతి ఒక్కరూ రజనీకే ఓటు వేస్తారని చెప్పారు. అతనికి పోటీగా నిలబడటం ఏ రాజకీయ పార్టీకైనా కష్టమేనని అన్నారు.

ram gopal varma
Pawan Kalyan
rajani kanth
  • Loading...

More Telugu News