arrest: అందుకే, గజల్ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశాం: పంజాగుట్ట పోలీసులు

  • ఆ యువతి ఆర్థిక పరిస్థితిని ఆసరాగా తీసుకుని గజల్ శ్రీనివాస్ లైంగికంగా వేధించాడు
  • రెండు నెలల నుంచి ఆమె వేధింపులు ఎదుర్కుంటోంది
  • అన్ని ఆధారాలు ఉండడంతోనే అరెస్టు చేశాం

ఆలయవాణి అనే వెబ్ రేడియోలో జాకీగా పనిచేస్తోన్న ఓ యువతిని గజల్ శ్రీనివాస్ వేధించాడని పేర్కొంటూ పోలీసులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనను హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు కోర్టుకు తరలించారు. ఈ నేపథ్యంలో పంజాగుట్ట పోలీసులు మీడియాతో మాట్లాడుతూ వివరాలు తెలిపారు. "సేవ్ టెంపుల్ అనే ఆర్గనైజేషన్ కు గజల్ శ్రీనివాస్ ప్రచారకర్తగా ఉన్నాడు. పంజాగుట్ట  వెంకట రమణ కాలనీలో ఆ ఆఫీస్ ఉంది. ఆ ఆర్గనైజేషన్‌కు అనుబంధంగా గజల్ శ్రీనివాస్ ఆలయవాణి అనే వెబ్ రేడియోను నడిపిస్తున్నాడు. అందులో జాకీగా ఓ యువతి పనిచేస్తోంది.

ఆమె అంతకు ముందు బాలవాణి అనే రేడియోలో పనిచేసింది. రెండు నెలల నుంచి ఆమెను గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. అన్ని ఆధారాలు ఉండడంతోనే అరెస్టు చేశాం. చాలా తీవ్రమైన కేసుగా పరిగణించవచ్చు. బాధితురాలి ఆర్థిక పరిస్థితులను ఆసరాగా తీసుకుని లైంగిక వేధింపులకు గురి చేశాడు" అని పోలీసులు వ్యాఖ్యానించారు.

arrest
Hyderabad
Police
gazal srinivas
  • Loading...

More Telugu News