Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఓ జోకర్.. ఆయనపై ఎన్నికల్లో పోటీ చేస్తా: కత్తి మహేష్

  • రేణు దేశాయ్ పై దాడి జరుగుతున్నప్పుడే పవన్ స్పందించలేదు
  • నా విషయంలో ఎందుకు స్పందిస్తారు?
  • ఆయన దిగజారుడు రాజకీయాలను ఎండగడతా

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సినీ విమర్శకుడు కత్తి మహేష్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తిక్క సేన, పిచ్చి సేనానితో తాను పోరాడుతున్నానంటూ ఘాటుగా స్పందించాడు. ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ పై గతంలో ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా దాడి చేస్తున్నప్పుడు కూడా పవన్ స్పందించలేదని... అలాంటి వ్యక్తి తనపై ఆయన అభిమానులు చేస్తున్న దాడి పట్ల స్పందిస్తారని తాను భావించడం లేదని అన్నాడు.

ఫేస్ బుక్ లో, ట్విట్టర్ లో తాను ఏ కామెంట్ పెట్టినా,  ఏదైనా సినిమా రివ్యూ రాసినా... దానికిందంతా పవన్ కల్యాణ్ అభిమానుల బూతులు కనబడుతున్నాయని కత్తి మహేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై ప్రత్యక్షంగా దాడి జరుగుతున్నా పవన్ స్పందించడం లేదని చెప్పాడు. 'కత్తి మహేష్ పై దాడిని ఆపండి' అంటూ పవన్ ఒక్క ట్వీట్ చేసినా... దీనికి ముగింపు పడుతుందని అన్నాడు. తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకే పోరాడుతున్నానని చెప్పాడు. మాజీ భార్య విషయంలోనే సైలెంట్ గా ఉన్న పవన్ ను... రాజకీయంగా ఉద్ధరిస్తానని చెబితే ఎవరూ నమ్మబోరని అన్నారు.

రాజకీయాల్లోకి ఓ జోకర్ లా ఆయన ఎంటర్ అయ్యారని మహేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోస పూరిత రాజకీయాలు, ఓట్లు చీల్చే రాజకీయాల్లో భాగంగానే పవన్ రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. రాజకీయంగా పవన్ కల్యాణ్ ను ఎదుర్కొనేందుకు తాను ఇప్పుడు సిద్ధంగా ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పవన్ ఎక్కడ నుంచి పోటీ చేసినా, తాను కూడా అక్కడి నుంచే ఆయనపై పోటీకి నిలబడతానని... పవన్ దిగజారుడు రాజకీయాలను ఎండగడతానని చెప్పాడు. తన అభిప్రాయాలకు దగ్గరగా ప్రస్తుతం ఏ పార్టీ కూడా లేదని... ఈ నేపథ్యంలో, తాను ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానని తెలిపాడు. 

Pawan Kalyan
Kathi Mahesh
Tollywood
  • Loading...

More Telugu News