new year: 2017 సంవత్సరం రాష్ట్రాభివృద్ధికి ఎంతో కలిసొచ్చింది.. వండర్ ఫుల్ ఇయర్ : చ‌ంద్ర‌బాబు

  • 2017లో ఎంతో ప్రగతి సాధించాం
  • 2018లో అంతకంటే ఎక్కువ ప్రగతి సాధిద్దాం
  • అనుకున్న రీతిలో వర్షాలు పడుంటే మరింత అభివృద్ధి సాధించేవాళ్లం
  • జన్మభూమి – మా ఊరు కార్యక్రమం ఒక మహాయజ్ఞం

జన్మభూమి – మా ఊరు కార్యక్రమం ఒక మహాయజ్ఞమ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. రాష్ట్రాభివృద్ధికి చేపట్టిన ఈ మహాయజ్ఞంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. '2017 సంవత్సరం రాష్ట్రాభివృద్ధికి ఎంతో కలిసొచ్చింది. వండర్ ఫుల్ ఇయర్.. 2017లో ఎంతో ప్రగతి సాధించాం. 2018లో అంతకంటే ఎక్కువ ప్రగతి సాధిద్దాం. దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళుతున్నాయి. జల హారతి వల్ల ఎంతో ప్రయోజనం కలిగింది. అనుకున్న రీతిలో వర్షాలు పడుతుంటే మరింత అభివృద్ధి సాధించేవాళ్లం' అని వ్యాఖ్యానించారు.

ఈ రోజు అమరావతిలోని స‌చివాల‌యంలో నిర్వ‌హించిన ఓ స‌మీక్ష కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు మాట్లాడుతూ... "భూగర్భ జలాల పెంపుదలకు తీసుకున్న చర్యలతో కరెంట్ వినియోగం తగ్గింది. దీనివల్ల రూ.200 నుంచి రూ.300 కోట్ల మేర ఆదా అయ్యింది. సేంద్రీయ వ్యవసాయం సాగుకు రైతుల్లో చైతన్యం తీసుకొస్తున్నాం. దీనివల్ల గణనీయంగా రసాయనిక ఎరువుల వాడకం తగ్గింది. సేంద్రీయ వ్యవసాయం ద్వారా రైతులకు ఆర్థిక భారం తగ్గుతుంది.
 
ప్రస్తుతం రాష్ట్రంలో లక్షా 50 వేల ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయం సాగవుతోంది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్గానిక్ క్లస్టర్ గా ఏపీ అవతరిస్తోంది. సేంద్రీయ సాగు వల్ల వాతావరణం, ఆరోగ్యంపై ఎంతో మంచి ప్రభావం చూపుతుంది.  విద్యుత్ ఛార్జీలు పెంచబోమని దేశంలోనే తెలిపిన ఒకే ఒక్క ప్రభుత్వం మాదే. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కరెంట్లో మిగులు ఉత్పత్తి సాధించాం. సోలార్ విద్యుత్ కు నాంది పలికాం.

జన్మభూమి-మా ఊరును అతిపెద్ద పండగగా జరుపుకుందాం. జన్మభూమి జరిగే పది రోజుల పాటు తమ కోసం, తమ గ్రామం కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఏర్పడిన నవ్యాంధ్రలో కష్టాలను అధిగమించి, మొదటి ఏడాదిలోనే అన్ని ఇళ్లకూ కరెంట్ ఇవ్వగలిగాం. 100 శాతం మేర గ్యాస్ కనెక్షన్లు అందజేశాం. ఆత్మగౌరం పేరిట మరుగుదొడ్లు నిర్మిస్తున్నాం. 14 నుంచి 15 వేల కిలో మీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించాం" అని అన్నారు.

  • Loading...

More Telugu News