gajal srinivas: రేడియో జాకీపై లైంగిక వేధింపుల కేసులో గజల్ శ్రీనివాస్ అరెస్ట్.. కాసేపట్లో రిమాండ్ కు తరలింపు!

  • రేడియో జాకీపై లైంగిక వేధింపులు
  • పంజాగుట్ట పీఎస్ లో బాధితురాలు ఫిర్యాదు
  • ఆరోపణలను ఖండించిన శ్రీనివాస్

ప్రముఖ గజల్ కళాకారుడు 'గజల్' శ్రీనివాస్ ను హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల కేసు నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, ఆలయవాణి అనే వెబ్ రేడియోలో ఓ యువతి రేడియో జాకీగా పని చేస్తున్నారు. ఈ వెబ్ రేడియోకు గజల్ శ్రీనివాస్ బ్రాండ్ అంబాసడర్ గా ఉన్నారు. ఈ క్రమంలో తనపై గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆధారాలతో సహా ఆమె డిసెంబర్ 29వ తేదీ సాయంత్రం కేసు పెట్టారు. తనను బెదిరిస్తూ పెట్టిన మెసేజ్ లను పోలీసులకు సమర్పించారు.

ఈ నేపథ్యంలో, కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, గజల్ శ్రీనివాస్ గత కొంత కాలంగా తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నారంటూ బాధితురాలు ఫిర్యాదు చేశారని చెప్పారు. మరోవైపు, శ్రీనివాస్ ను రిమాండ్ కు తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు, తనపై కావాలనే తప్పుడు కేసు పెట్టారని గజల్ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. 

gajal srinivas
gajal srinibas arrest
  • Loading...

More Telugu News