Ravikant: అలా టీడీపీలోకి వెళ్లి.. ఇలా తిరిగి సొంత గూటికి గుడివాడ వైకాపా నేత!

  • ఇటీవల దేవినేని సమక్షంలో టీడీపీలో చేరిన రవికాంత్
  • తిరిగి వైకాపాలోకి గుడివాడ నేత
  • ప్రలోభాలకు గురి చేశారని ఆరోపణలు

కొద్దికాలం క్రితం ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సమక్షంలో టీడీపీలోకి ఫిరాయించిన గుడివాడ మున్సిపల్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత రవికాంత్‌ తిరిగి సొంత గూటికి వచ్చేశారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో వైకాపా కండువా కప్పుకున్న ఆయన, మీడియాతో మాట్లాడుతూ, టీడీపీపై సంచలన ఆరోపణలు చేశారు.

తెలుగుదేశం నేతలు కుట్రలు, బెదిరింపులకు పాల్పడి తనను ఆ పార్టీలోకి తీసుకు వెళ్లారని ఆరోపించారు. అతి త్వరలో వారు తనను ఏ విధంగా ప్రలోభపెట్టారో ఆధారాలతో సహా మీడియాకు అందిస్తానని చెప్పారు. ఇదే సమావేశంలో కొడాలి నాని మాట్లాడుతూ, వైకాపా నేతలను ప్రలోభ పెట్టి చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారని, అవి కొనసాగితే, ఇటువంటి సంఘటనలే ఎదురవుతాయని హెచ్చరించారు.

Ravikant
Kodali Nani
Gudiwada
YSRCP
  • Loading...

More Telugu News