delhi: కొత్త సంవత్సరం మొదటి రోజు సాయంత్రం.. ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్!

  • న్యూ ఇయర్ సందర్భంగా ‘ఇండియా గేట్’ వద్ద భారీ సంఖ్యలో  ప్రజలు
  • స్తంభించిన ట్రాఫిక్..ఎక్కడి వాహనాల అక్కడే
  • ఈరోజు మధ్యాహ్నం నుంచి చిన్నగా కదులుతున్న వాహనాలు
  • సుమారు ఐదారు గంటల పాటు వాహనదారుల ఇక్కట్లు

కొత్త సంవత్సరం మొదటి రోజు సాయంత్రం ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కొత్త సంవత్సరం సందర్భంగా ‘ఇండియా గేట్’ , వద్దకు భారీ సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. ముఖ్యంగా పాదచారులు, వాహనాలపై అక్కడికి చేరుకున్న వారి సంఖ్య  సుమారు 2.5 లక్షలకు పైగా ఉంది. దీంతో, ‘ఇండియా గేట్’ నుంచి రైసినా హిల్స్ వరకు ట్రాఫిక్ జామ్ అవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

ఈరోజు మధ్యాహ్నం నుంచి ట్రాఫిక్ చిన్నగా కదులుతోంది. సుమారు ఐదారు గంటల పాటు వాహనదారులు చాలా ఇబ్బందిపడ్డారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ, తాము ఊహించిన దాని కన్నా ఏడు రెట్లు ఎక్కువ ట్రాఫిక్ ఉందని అన్నారు.

కాగా, ట్రాఫిక్ జామ్ అవడంపై  సామాజిక మాధ్యమాల ద్వారా అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. ట్రాఫిక్ పోలీసుల  మిస్ మేనేజ్ మెంట్ కారణంగానే జామ్ అయిందని, ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోతే పోలీస్ సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా వాహనాలను ఎలా దారి మళ్లిస్తారని ప్రశ్నించారు. తిలక్ మార్గ్, సీపీ, ఇండియా గేట్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయిందని, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు ఎటువంటి ముందస్తు చర్యలు చేపట్టలేదా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

  • Loading...

More Telugu News