Telangana: రేపు ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

  • రాష్ట్ర ఎంపీలతో కలిసి ఉపరాష్ట్రపతిని కలవనున్న ఇంద్రకరణ్ రెడ్డి
  • మేడారం జాతర, గిరిజన కుంభమేళాలకు జాతీయ పండగ గుర్తింపు కావాలి 
  •  కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రితో కూడా భేటీ 

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండగగా గుర్తించాలని కోరే నిమిత్తం తెలంగాణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ విషయమై మాట్లాడేందుకు రాష్ట్ర ఎంపీలతో కలిసి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరమ్ ను కలవనున్నట్టు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, గిరిజన కుంభమేళాగా పిలిచే మేడారం జాతరను జాతీయ పండగగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని చెప్పారు. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరని, ఈ జాతరకు మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు హాజరవుతారని తెలిపారు.  

  • Loading...

More Telugu News