goranti venkanna: గోరటి వెంకన్నకు అరుణ్ సాగర్ సాహితీ పురస్కారం

  • తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ ప్రకటన
  • ఉత్తమ జర్నలిస్ట్ అవార్డుల ప్రదానోత్సవం 
  • తెలుగు విశ్వవిద్యాలయంలో రేపు నిర్వహించనున్న కార్యక్రమం

ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న అరుణ్ సాగర్ సాహితీ పురస్కారం అందుకోనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ కవి, రచయిత, సీనియర్ పాత్రికేయుడు అరుణ్ సాగర్ పేరిట ఉత్తమ జర్నలిస్ట్ అవార్డుల ప్రదాన కార్యక్రమం రేపు నిర్వహించనున్నట్టు తెలిపారు.

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీలో రేపు సాయంత్రం 6 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి హరీశ్ రావు హాజరుకానున్నారని తెలిపారు. కాగా, 2016 ఫిబ్రవరి 12న అరుణ్ సాగర్ మృతి చెందారు. పత్రికారంగంలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఆయన పనిచేశారు. ‘మేలుకొలుపు’, ‘మ్యూజిక్ డైస్’, ‘మ్యాగ్జిమమ్ రిస్క్’ కవితా సంకలనాలు ఆయనకు మంచిపేరు తీసుకొచ్చాయి.

goranti venkanna
arun sagar
  • Loading...

More Telugu News