Allu Arjun: అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఫస్ట్ ఇంపాక్ట్ ఇది!

  • ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఫస్ట్ ఇంపాక్ట్ ను విడుదల చేసిన బన్నీ
  • హూ..ఆర్..యూ’ అనే పదాలు వినపడుతుండగా బన్నీ ఎంట్రీ
  •  ఆకట్టుకుంటున్న పలు యాక్షన్ సన్నివేశాలు

వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ ఇంపాక్ట్
పేరిట ఓ వీడియోను అల్లు అర్జున్ ఈరోజు సాయంత్రం విడుదల చేశారు. బన్నీ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశాడు.

‘హూ..ఆర్..యూ’ అనే పదాలు వినపడుతుండగా హీరో అల్లు అర్జున్ నడుచుకుంటూ వెళ్లే సన్నివేశంతో ఈ వీడియో ప్రారంభమైంది. ‘ఐ యామ్ ఏ సోల్జర్’, ‘నీకు సూర్య అంటే సోల్జర్, కానీ, ప్రపంచానికి సూర్య అంటే యాంగర్’.. అనే వాక్యాలు వినిపిస్తుండగా యాక్షన్ సన్నివేశాల్లో బన్నీ కనపడడం ఈ ఫస్ట్ ఇంపాక్ట్ లో కనబడుతుంది.

  • Loading...

More Telugu News