rajani: అభిమానులకు రజనీకాంత్ పై అపారమైన నమ్మకం ఉంది: నటుడు సాయికుమార్

  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సాయికుమార్ దంపతులు
  • శ్రీవేంకటేశ్వరుడు, చిలుకూరు బాలాజీ కథ ఆధారంగా ఓ చిత్రం
  • ఈ సినిమాలో ప్రధానపాత్ర పోషిస్తున్నా
  • ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం రజనీది: సాయికుమార్

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజకీయాల్లోకి రానుండటంపై దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే తమ అభిప్రాయాలతో పాటు అభినందనలూ తెలిపారు. తాజాగా, టాలీవుడ్ నటుడు, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయికుమార్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని సాయికుమార్ తన కుటుంబ సమేతంగా ఈరోజు  ఉదయం దర్శించుకున్నారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరుడు, హైదరాబాద్ లోని చిలుకూరు బాలాజీ అవతారాలు ఎలా ఉద్భవించాయన్న కథ ఆధారంగా నిర్మిస్తున్న చిత్రంలో తాను ప్రధాన పోత్ర పోషించానని, ఈ సినిమా త్వరలోనే విడుదల కానుందని చెప్పారు.

ఈ సందర్భంగా రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్న విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా సాయికుమార్ స్పందిస్తూ, రాజకీయాల్లోకి ఆయన రానుండటం మంచి పరిణామమని, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ఉన్న మంచి వ్యక్తి ఆయన అని ప్రశంసించారు. అవకాశమిస్తే ప్రజలకు సేవ చేస్తారనే నమ్మకం ఆయనపై తనకు ఉందని సాయికుమార్ స్పష్టం చేశారు. కాగా, సాయికుమార్ తో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News