Pakistan: పాక్‌తో ఎట్టిపరిస్థితుల్లోనూ ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ఆడే ప్రసక్తే లేదు: తేల్చి చెప్పిన సుష్మా స్వరాజ్
- తటస్థ వేదిక మీద కూడా ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లు జరగవు
- సరిహద్దు వద్ద హింస పెరుగుతున్న నేపథ్యంలో నిర్ణయాలు
- ఇరు దేశాలను ఒకే గ్రూపులో పెట్టొద్దని గతంలోనూ ఐసీసీని కోరిన బీసీసీఐ
పాకిస్థాన్ తరుచూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోన్న నేపథ్యంలో ఇప్పటికే భారత్, పాక్‌ల మధ్య క్రికెట్ మ్యాచులు జరగడం లేని విషయం తెలిసిందే. గ్లోబల్ టోర్నమెంట్లలోనూ ఇరు దేశాలను ఒకే గ్రూపులో పెట్టొద్దని బీసీసీఐ కూడా గతంలో ఐసీసీని కోరింది. తాజాగా కుల్‌భూషణ్ జాదవ్ విషయంలో పాక్ వ్యవహరించిన తీరుతో మరింత అగ్గి రాజుకుంది.
ఆ దేశంతో ఎట్టిపరిస్థితుల్లో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ఆడే ప్రసక్తే లేదని భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మరోసారి తేల్చి చెప్పారు. తాజాగా ఆమె ఓ సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తటస్థ వేదిక మీద కూడా ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లు జరగవని అన్నారు. సరిహద్దు వద్ద హింస పెరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు.